కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న “కూలీ” సినిమాపై ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా, ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ పైనే ఉంది.
ఈ ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ఇప్పటికే ఖరారు చేశారు. రేపే అంటే ఆగస్ట్ 2న “కూలీ” ట్రైలర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్షకులకు అదిరే ఫీల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికోసం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియాన్ని వేదికగా ఎంపిక చేశారు. ఇదే వేదికపై రేపు ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు.
ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ ద్వారా భారీ బజ్ క్రియేట్ అయిన “కూలీ” ట్రైలర్ ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ పెరిగింది. రజినీ స్టైల్, లోకేష్ మేకింగ్ కలిసి మరింత ఆకర్షణగా ఉండబోతుందన్న టాక్ కొనసాగుతోంది. మరి రేపు విడుదలవుతున్న ట్రైలర్ ఆ అంచనాలకు న్యాయం చేస్తుందో లేదో చూడాల్సిందే.
