టాలీవుడ్ లో జరుగుతున్న ఆసక్తికరమైన కాంబినేషన్స్ లో ఒకటి దర్శకుడు పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి చేస్తున్న కొత్త సినిమా. ఈ ప్రాజెక్ట్ గురించి మొదటి నుంచే మంచి బజ్ నెలకొంది. షూటింగ్ కూడా వేగంగా జరగడంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు సినిమా పేరు, కథా నేపథ్యం వంటి విషయాలను టీమ్ రహస్యంగానే ఉంచింది.
ఇక తాజాగా మేకర్స్ ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ ను సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. నిర్మాణ బాధ్యతలను ఛార్మి, పూరి స్వయంగా చేపట్టారు.
