పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “ది రాజా సాబ్”పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది. ఈ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించనున్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్ అక్టోబర్ నెల నుంచి స్టార్ట్ కానున్నాయి. ముందుగా ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే, ఆ తర్వాత మొదటి పాటను బయటకు తీసుకురానున్నారు. ఇటీవలే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 23న ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు. అలాగే “కాంతార 1” సినిమా థియేటర్స్ లో ట్రైలర్ ను చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే అక్టోబర్ లో ప్రభాస్ అభిమానులకు డబుల్ ట్రీట్ దక్కనుంది.
