మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం “మాస్ జాతర”పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాను బాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కి మొదట ఆగస్ట్‌లోనే విడుదల ప్లాన్ చేసినప్పటికీ, అనుకోని కారణాలతో వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినా, ఫిల్మ్ నగర టాక్ ప్రకారం అక్టోబర్ చివరలో లేదా నవంబర్ మొదటి వారంలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది.
