రష్మిక మందన్నా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమా ఈ అక్టోబర్ లో రానుండగా, కొద్ది రోజుల్లోనే మరో కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న “ది గర్ల్ ఫ్రెండ్”.
ఈ కథలో రష్మికకు జోడీగా యువ నటుడు దీక్షిత్ శెట్టి కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఒక ఆసక్తికరమైన గ్లింప్స్ వీడియో ద్వారా ప్రకటించారు. ఆ గ్లింప్స్ చూస్తే రాహుల్ రవీంద్రన్ రష్మికను కొత్తగా చూపించడానికి ప్రయత్నించినట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా రష్మిక–దీక్షిత్ శెట్టి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి.
ఇక టీజర్ లో కనిపించినంత వరకు మ్యూజిక్ డైరెక్టర్ హీశం అబ్దుల్ వాహబ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంటోంది.
