పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజి విడుదలైన తర్వాత ఇంకా మంచి హైప్‌ను సొంతం చేసుకుంటోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ప్రత్యేకమైన యూనివర్స్‌ను నిర్మించడం వల్ల పవన్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఓటిటి రిలీజ్ గురించి చర్చలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ఓజి డిజిటల్ విడుదలపై అధికారిక సమాచారం ఇచ్చి అభిమానుల్లో కొత్త ఉత్సాహం రేపింది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఓటిటి వెర్షన్‌లో ఒక ప్రత్యేక విషయాన్ని ఆశిస్తున్నారు. థియేటర్లలో చూపించని కొన్ని డిలీటెడ్ సీన్స్, పవన్ చెప్పిన కొన్ని పంచ్ డైలాగ్స్ వంటి వాటిని ఓటిటి వెర్షన్‌లో చేర్చితే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నారు.
‘తలలు జాగ్రత్త’ లాంటి పవన్ స్టైల్ డైలాగ్స్ మిస్ కావడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. అందుకే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వెర్షన్‌లో అలాంటి సీన్స్ ఉంటాయేమోనని ఎదురుచూస్తున్నారు.
