మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన తాజా సినిమా “ఓదెల 2” గురించి అందరికీ తెలిసిందే. రచ్చ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో యంగ్ డైరెక్టర్ అశోక్ తేజ తెరకెక్కించిన ఈ హారర్, డివోషనల్ చిత్రం థియేటర్స్ లో ఓకే అనిపించింది. అయితే రిలీజ్ కి ముందే సాలిడ్ బిజినెస్ ని చేసేసుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమా హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ రానున్న మే 16న కానీ లేదా అంతకు ముందే అందుబాటులోకి వచ్చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనిపై అధికారిక క్లారిటీ రాలేదు.
