టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “తమ్ముడు”. ఈ చిత్రం అనౌన్స్ చేసినపుడు మంచి బజ్ ని అందుకుంది కానీ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం కొంచెం సస్పెన్స్ గానే మారుతూ వచ్చింది. ఇక ఇలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు.
దీంతో తమ్ముడు చిత్రాన్ని ఈ జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు సస్పెన్స్ కి తెర దించారు. అలాగే ఈ అనౌన్సమెంట్ పై ఇంట్రెస్టింగ్ ఫన్ వీడియోని దర్శకునిపై ప్లాన్ చేసి రిలీజ్ చేయడం ప్రమోషనల్ గా కూడా బాగుంది. సో నితిన్ అయితే ఈ జూలై 4న థియేటర్స్ లో పలకరించనున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
