కిష్కిందపురి ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

Friday, December 5, 2025

టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ మంచి టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ చేయగలిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా, ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించాడు.

సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటల నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వార్తతో సినిమా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles