ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కృతి శెట్టి, తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అందం, నటన రెండింటినీ కలిపిన ఈ బ్యూటీ వరుసగా పలు చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమె కెరీర్ కొంత మందగించింది.
ఇప్పుడు కృతి కొత్త దిశలో అడుగు వేయాలని చూస్తున్నట్టుంది. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని ఆమె ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటుడు గోవింద కుమారుడు యశ్వర్ధన్ అహుజ హీరోగా నటిస్తున్న హిందీ సినిమాలో కృతి హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా సమాచారం వెలువడింది.
కృతి తప్పుకోవడానికి కారణం ఏంటో ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదు. దీంతో అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
