కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ” కోసం అందరికీ తెలిసిందే. మరి అజిత్ ఫ్యాన్స్ కి ఒక ఫ్యాన్ ట్రీట్ సినిమాలా వచ్చిన ఈ చిత్రం అజిత్ కెరీర్లో భారీ హిట్ అయ్యింది. ఇక ఇలా థియేటర్స్ లో సందడి చేసిన తర్వాత ఓటిటిలో విడుదలకి ఈ మూవీ ఇపుడు రెడీ అవుతుంది.
ఈ చిత్రం తాలూకా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా పాన్ ఇండియా తేదీని ఖరారు చేసింది. ఈ మే 8 నుంచి ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలిపారు. సో ఇంకొన్ని రోజుల్లో అజిత్ మాస్ సంభవం ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు రెడీగా ఉంది.
