మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ఈ ఏడాదిలోనే వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాటిలో రెండు సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్ గురించి ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. ఆ సినిమానే “వృషభ”.
నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుంది. ఈ సినిమాలో నుంచి పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్న ట్రైలర్ ను ఈ నెల 18న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది.
ఇక ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది తాజాగా మహావతార్ నరసింహతో సెన్సేషనల్ హిట్ ఇచ్చిన సామ్ సి ఎస్. నిర్మాణ బాధ్యతలు కనెక్ట్, ఏ వి ఎస్, బాలాజీ ఫిలింస్ లిమిటెడ్ కలిసి నిర్వహిస్తున్నారు.
