మహేష్‌ జక్కన్న సినిమా పై అప్‌డేట్‌ ఎప్పుడంటే!

Monday, December 8, 2025

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా కోసం మేకప్ వేసుకుని ఇప్పటికే దాదాపు 10 నెలలు దాటిపోతుంది.  మహేష్ చివరిసారిగా పెద్ద తెరపై కనిపించి ఇప్పటికే 8 నెలలు దాటింది. దర్శక ధీరుడు రాజమౌళి తరువాత సినిమాకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పటి వరకు ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి డెవలప్‌మెంట్‌ లేదు. మూవీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథకు సంబంధించి కొన్ని అప్‌ డేట్‌ లు ఇవ్వడం తప్ప, రాజమౌళి నుంచి మాత్రం ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు రాజమౌళి కూడా ఓ సినిమాకు పనిచేసి దాదాపు రెండేళ్లు పూర్తయ్యింది.

ఈ నేపథ్యంలో మహేష్ సినిమాని రాజమౌళి త్వరగా స్టార్ట్ చేసి.. అంతే త్వరగా ఫినిష్ చేయాలని అభిమానులు అనుకుంటున్నారు. ఎలాగూ 2024లో 60% ఇప్పటికే పూర్తి అయ్యింది కాబట్టి, రానున్న రెండు, మూడు నెలల్లో అయినా మహేష్ సినిమా షూటింగ్ ప్రారంభమైతే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎలాగూ రాజమౌళి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం 2 సంవత్సరాలు తీసుకుంటాడు. ఈ లెక్కన 2026 ఎండింగ్ లోనైనా తమ హీరో సినిమా విడుదల అయితే బాగుండు అని మహేష్ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇంతకీ, మహేష్ సినిమా పై రాజమౌళి ఎప్పుడు అప్ డేట్ ఇస్తాడో…ఇంకా ఎంతకాలం వేచి చూడాలో..!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles