శబ్దం ట్రైలర్ ఎప్పుడంటే..!

Thursday, March 27, 2025

శబ్దం ట్రైలర్ ఎప్పుడంటే..! టాలీవుడ్‌లో థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి రెస్పాన్స్ అందిస్తారు. ఈ కోవలోనే వచ్చిన ‘వైశాలి’ చిత్రాన్ని ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిపారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటించగా అరివళగన్ వెంకటాచలమ్ డైరెక్ట్ చేశారు. దీంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో ‘శబ్దం’ అనే మరో థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్ర ట్రైలర్ కట్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే, ఈ ట్రైలర్‌ను ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఈ ట్రైలర్ కట్ ఎలా ఉండబోతుందా.. ‘వైశాలి’ తరహా వైబ్స్‌ని ఇది క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 28 నుంచి వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles