తెలుగుతో పాటు తమిళ ఆడియెన్స్ లో ముద్ర వేసిన కొన్ని అతి తక్కువ సినిమాల్లో రవికృష్ణ అలాగే సోనియా అగర్వాల్ కాంబోలో డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన అతిపెద్ద హిట్ మూవీ “7/జి బృందావన కాలనీ” కూడా ఒకటి. అయితే అప్పట్లో అదరగొట్టిన ఈ మూవీ రీరిలీజ్ కి కూడా వచ్చి మంచి వసూళ్లు సాధించింది.
అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉన్నట్టుగా మేకర్స్ తేల్చి చెప్పారు. అయితే ఈ కొత్త సంవత్సరం కానుకగా చిత్ర బృందం ఓ ఆసక్తికర అప్డేట్ ని ఈ మూవీ సీక్వెల్ పై తీసుకొచ్చారు. ఫస్ట్ లుక్ అంటూ ఒక ప్రీ లుక్ లాంటిది విడుదల చేసి అందులో ఒక జంట కనపడుతున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ అంతిమ దశకి వచ్చేసినట్టుగా చెప్పారు.
ఇది ఇంకా హైలైట్ అని చెప్పాలి. మరి ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా మళ్ళీ వారే ఉంటారా లేదా కొత్త నటీనటులతో ప్లాన్ చేసారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కూడా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నమే నిర్మాణ బాధ్యతలు చేపట్టరు.