తండేల్‌ విడుదల ఎప్పుడంటే!

Sunday, December 22, 2024

అక్కినేని యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న భారీ సినిమా “తండేల్” . భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ పర్టిక్యులర్ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా విడుదల ఈ ఏడాది డిసెంబరు లోనే అంటూ చిత్ర బృందం ఎప్పుడో తెలిపింది.

కానీ ఇది సాధ్యం కాదని తేలిపోయింది. అలాగే సంక్రాంతి బరిలో కూడా కష్టమే అని కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. ఇపుడు ఫైనల్ గా ఈ అవైటెడ్ సినిమా డేట్ ఫిక్స్‌  చేసుకున్నట్టు సమాచారం.

దీని ప్రకారం తండేల్ ఫిబ్రవరి 7కి లాక్ అయినట్లు సమాచారం అలాగే దీనిపై అధికారిక ప్రకటన నేడు ప్రెస్ మీట్ లో ఇదే డేట్ ఇస్తారా లేక వేరేదా అనేది చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో సినిమా రూపుదిద్దుకుంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles