మలయాళంలో విడుదల ఎప్పుడంటే!

Andhrawatch
1 Min Read

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్‌ చేసిన సాలిడ్ కం బ్యాక్  సూపర్‌ హిట్ సినిమా “క”. ఈ సినిమా విడుదలకి ముందు నుంచే ఎంతో నమ్మకంగా ప్రమోట్ చేస్తూ ఈ సినిమా నచ్చకపోతే ఇక సినిమాలు ఆపేస్తాను అనే గట్స్ తో కూడిన స్టేట్మెంట్ ని ఇచ్చిన ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి భారీ హిట్ అయ్యింది.

మరి ముందే పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ పలు కారాణాల రీత్యా సినిమా మొదట తెలుగులో రిలీజ్ కి వచ్చింది. ఇక తెలుగులో మాసివ్ హిట్ కావడంతో ఒకో భాషలో ఇపుడు రిలీజ్ కి తీసుకొస్తున్నారు. మరి కంటెంట్ కి కేరాఫ్ అడ్రస్‌ అయినటువంటి మళయాళ మూవీస్‌  దగ్గర ఇపుడు “క” మూవీ సందడి చేసేందుకు సిద్దమయ్యింది.

అక్కడ ఈ చిత్రం ఈ నవంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు ఆ మధ్య టాక్ వచ్చింది. మరి ఫైనల్ గా మేకర్స్ ఈ తేదీనే ఖరారు చేసి ఇపుడు ప్రకటించారు. మరి మంచి కంటెంట్ ఉన్న మళయాళ సినిమాలను టాలీవుడ్‌ లో బాగానే ఆదరిస్తారు. మరి మన నుంచి వెళ్తున్న కంటెంట్ సినిమాకి అక్కడ ఎలాంటి ఆదరణ వస్తుందో వేచి చూడాల్సిందే.

Share This Article