సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న తాజా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “సంబరాల ఏటి గట్టు” మీద సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ మొదట సెప్టెంబర్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పినా, తాజాగా ఆ ప్లాన్ మార్చబడింది. మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పెద్ద అప్‌డేట్‌ను అక్టోబర్ 15న ప్రకటించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఆ రోజే కొత్త రిలీజ్ డేట్ కూడా ఫైనల్ చేయబోతున్నారని సమాచారం.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా తెలుగు సహా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్‌తో పాటు జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవి కృష్ణ వంటి పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
