టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జ మరోసారి వెరైటీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల “ఈగల్” సినిమాతో డిఫరెంట్ థాట్స్ చూపించిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో అతడు నటిస్తున్న కొత్త సినిమా పేరు “మిరాయ్”. పాన్ వరల్డ్ స్కేల్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవలే చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు మొదటి పాట విడుదల తేదీని ప్రకటించారు. జూలై 26న “వైబ్ ఉంది” అనే టైటిల్‌తో ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. సినిమాలో హీరోయిన్‌గా రితికా నాయక్ నటిస్తుండగా, ఈ పాటను ప్రధాన జంటపై చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న గౌర హరి గతంలో హను మాన్ చిత్రానికి సంగీతం అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి కూడా ఆయన స్వరాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి మ్యూజిక్ ప్రేమికుల్లో కనిపిస్తుంది.
తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ఈ పాట సినిమాపై హైప్‌ని మరింత పెంచే అవకాశం ఉంది. వరల్డ్ క్లాస్ విజువల్స్‌తో ఈ మూవీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందనే టాక్ ఇప్పటికే వినిపిస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. యూత్‌కి నచ్చే స్టైల్, టెక్నికల్‌గా స్ట్రాంగ్ ప్రెజెంటేషన్‌తో “మిరాయ్” మరో విజువల్ వండర్‌గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
