విడుదల ఎప్పుడంటే!

Tuesday, January 21, 2025

మెగా హీరో వరుణ్‌ తేజ్ తాజాగా నటిస్తున్న తాజా సినిమా  ‘మట్కా’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డైరెక్టర్‌  కరుణ కుమార్ పీరియాడిక్ మూవీగా రూపుదిద్దుతున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాను వరుణ్ తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు తెగ వెయిట్‌ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ‘మట్కా’ చిత్ర విడుదల తేదీని అక్టోబర్ 1న ఉదయం 11.05 గంటలకు ప్రకటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా తెలిపింది.

ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు జీవీ.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డా.విజేందర్ రెడ్డి తీగల, రజని తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles