గేమ్ ఛేంజర్‌ నెక్ట్స్‌ అప్డేట్‌ ఎప్పుడంటే!

Wednesday, April 2, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్ 2024 క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటి వరకు, మేకర్స్ రెండు పోస్టర్లు , ఒక మాస్ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే.

ఆగస్ట్ నెలాఖరులోగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ చేస్తామని సంగీత దర్శకుడు థమన్ అంతకుముందు హామీ ఇచ్చారు. అయితే తాజా సమాచారం ఏమిటంటే గేమ్ ఛేంజర్  తదుపరి అప్డేట్ సెప్టెంబర్ రెండవ వారంలో రాబోతుందంట.

ఆ అప్డేట్‌ లో గ్లింప్స్‌ లేకపోతే కొత్త పాటకి సంబందించిన అప్డేట్ ఆ అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు.  శంకర్ ఫైనల్ ఎడిట్‌ను లాక్ చేసిన తర్వాత, అతను సినిమాను దూకుడుగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నాడు. గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటించింది. ఎస్‌జే సూర్య విలన్‌  పాత్రలో నటిస్తున్నాడు. అంజలి శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్, శుభలేక సుధాకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles