కాంతారా చాప్టర్ 1 కొత్త ట్రైలర్‌ ఎప్పుడంటే!

Friday, December 5, 2025

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హవా చూపిస్తోంది. రిషబ్ తనదైన స్టైల్‌లో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆయన చూపించిన నేటివిటీ, ఆత్మీయత కలిసిన స్టోరీ ట్రీట్మెంట్ చూసి సినీప్రేమికులు మెచ్చుకుంటున్నారు.

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే, ఈ సినిమా మొదటి రోజుల్లోనే మంచి వసూళ్లను రాబట్టి సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతోంది. రిషబ్ డైరెక్షన్‌కి, స్క్రీన్ ప్రెజెన్స్‌కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రియాక్షన్ వస్తోంది.

ఇప్పుడేమో దీపావళి సందర్భంగా ఈ మూవీ టీమ్ మరో సర్ప్రైజ్‌కి రెడీ అవుతోంది. ఫెస్టివల్ స్పెషల్‌గా అక్టోబర్ 16న మధ్యాహ్నం 12.07 గంటలకు కొత్త ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అప్‌డేట్ బయటకు రాగానే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.

కొత్త ట్రైలర్‌లో ఎలాంటి సన్నివేశాలు చూపిస్తారో, ఇంకా కథలోని మిస్టరీని ఎంతవరకు రివీల్ చేస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో రిషబ్ శెట్టికి జోడీగా రుక్మిణి వసంత్ నటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles