టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీస్ ‘ఓదెల 2’ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. దర్శకుడు సంపత్ నంది తన సొంత బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
అయితే, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ అప్డేట్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ బిగ్ అప్డేట్‌ను మార్చి 22న ఉదయం 10.35 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సినిమాలో తమన్నా నాగసాధువు పాత్రలో నటిస్తండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక హెబ్బా పటేల్, వశిష్ట సింహ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లుక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.