తలైవర్ “వెట్టైయన్” కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే!

Wednesday, January 22, 2025

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా చేసిన ఇంతకు ముందు సినిమా జైలర్‌ తో సూపర్‌ హిట్‌ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత తాను గెస్ట్ రోల్ లో “లాల్ సలాం” సినిమా కూడా చేశారు.  కానీ అది అనుకున్న రీతిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఇక తన నెక్స్ట్ సినిమాల కోసమే అంతా ఎదురు చూస్తుండగా టాలెంటెడ్ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ తో చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ “వెట్టైయన్” కూడా ఒకటి.

మరి ఇందులో అమితాబ్, రానా లాంటి భారీ తారాగణం చేస్తుండగా ఈ సినిమా పై  భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ చిత్రాన్ని మూవీ మేకర్స్ నిజానికి అక్టోబర్ 10 విడుదల కి  రంగం సిద్ధం చేశారు.  కానీ ఆ డేట్ లో సినిమా రావట్లేదు అని రజినీకాంత్ నేస్వయంగా తెలియజేసారు. కానీ అదే అక్టోబర్ లో సినిమా విడుదల అయ్యే అవకాశం మాత్రం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక ఇపుడు ఓ కొత్త డేట్ కూడా ఇండస్ట్రీలో ప్రచారం చేస్తుంది. సినీ వర్గాల టాక్‌ ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 31న అలా రావచ్చని మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాని దీపావళి కానుకగా మూఈ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా ప్లాన్ చేస్తున్నారట. మరి దీని గురించి ఓ అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles