కల్కి ట్రైలర్‌ రిలీజ్ ఎప్పుడంటే

Sunday, December 22, 2024

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా కల్కి 2898 ఏడీ …ఈ సినిమాని నాగ్‌ అశ్విన్‌ బిగ్గెస్ట్ పాన్‌ వరల్డ్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బుజ్జి అనే స్పెషల్ క్యారెక్టర్ ను పరిచయం చేశారు. బుజ్జి అంటే ఓ రోబోటిక్ కార్. ఈ సినిమాలో ప్రభాస్ కు బుజ్జి క్లోజ్ ఫ్రెండ్. బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూవీకి ఎంతో స్పెషల్ అయిన బుజ్జిని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు పరిచయం చేసారు.

ఈ ఈవెంట్ తో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ను జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్‌ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles