ఏం ఉన్నాడురా బాబు!

Wednesday, January 8, 2025

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఙ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. యంగ్‌ అండ్‌ టాలెంటెడ్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌ లో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. తాజాగా ప్రశాంత్‌ వర్మ మోక్షజ్ఙ న్యూలుక్‌ కు సంబంధించిన ఓ ఫొటో షేర్‌ చేశారు.

యాక్షన్‌ కోసం సిద్ధమా? అని పేర్కొన్నారు. సింబా ఈజ్‌ కమింగ్‌ అని హ్యాష్‌ ట్యాగ్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ గా మారింది. మోక్షజ్ఙ కొత్త లుక్‌ పై సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

లెజెండ్‌ ప్రొడక్షన్స్‌ తో కలిసి ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకం పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు.ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా ఇది. బాలకృష్ణ విజన్‌ కి అనుగుణంగా , చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఈ సినిమా ఉంటుందని టాక్‌.

మోక్షజ్ఙ పుట్టినరోజును పురస్కరించుకొని సెప్టెంబర్‌ 6న ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఎన్నో అద్భుతమైన కథలు, బంగారు గని లాంటి మన ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందిస్తున్న చిత్రమిది.నేను ప్రారంభించిన సినిమాటిక్‌ యూనివర్స్‌ లో భాగంగానే తెరకెక్కుతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles