అసలేం జరుగుతోంది!

Andhrawatch
1 Min Read

‘మంచు మనోజ్’ గాయాలతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో, మంచు మోహ‌న్ బాబు కుటుంబం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే.. మంచు ఫ్యామిలిలో అసలేం జరుగుతుంది ?, నిజంగానే మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయా ?, శనివారం రాత్రి ఏం జరిగింది ? అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు  పెడుతున్నారు.

అయితే, ఆస్తుల పంపకం విషయంలోనే అసలు సమస్య మొదలైందని తెలుస్తుంది.ఇప్పటికే, మోహన్ బాబు తన ఆస్తులు పంచేశారట. అయితే మోహన్ బాబు ఫ్యామిలీకి ఎక్కువగా ఆదాయం తెచ్చి పెట్టేది తిరుపతిలోని విద్యా సంస్థలు. ఆ విద్యా సంస్థలలో మనోజ్ కోరుకున్నట్లు అతనికి వాటా రాలేదని, వాటిలో తన హక్కు కోసం మనోజ్ పోరాడుతున్నారని.. ఈ క్రమంలోనే శనివారం రాత్రి మోహన్ బాబు – మనోజ్ మధ్య మాట మాట పెరిగిందని ఓ టాక్‌ అయితే నడుస్తుంది. మరి చివరకు ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Share This Article