టాలీవుడ్‌లో తొలి సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ తాజా సినిమా మిరాయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై రిలీజ్‌కి ముందే మంచి బజ్ ఏర్పడింది. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మొదటి షోలు పూర్తికాగానే ఊహించని పాజిటివ్ స్పందన వచ్చింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా బాక్సాఫీస్‌లో కూడా మంచి రిపోర్ట్ తో మొదలైన మిరాయ్ ఓపెనింగ్స్ పై ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. తేజ సజ్జ గత హిట్ సినిమా హనుమాన్ డే వన్ రేంజ్‌లోనే మిరాయ్ కూడా వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి. దాదాపు 20 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని చెప్పబడుతోంది.
ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటే ఆ సంఖ్య 20 కోట్లకంటే ఎక్కువ కావచ్చని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.
