తమిళంలో ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి ఆకట్టుకున్న “3BHK” ఇప్పుడు తెలుగులోనూ విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సినిమాను శ్రీ గణేష్ అనే దర్శకుడు తెరకెక్కించగా, సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్ లాంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
తెలుగులో ఈ సినిమాను మైత్రీ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేయబోతుండటం విశేషం. ఇప్పటికే తమిళంలో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా కోలీవుడ్ స్టార్ శింబు ఈ సినిమాను చూసిన తర్వాత తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తన అభిప్రాయం ప్రకారం, ఈ సినిమా ఓ ఎమోషనల్ జర్నీలా భావోద్వేగాలతో నడుస్తూ, కుటుంబాన్ని కేంద్రంగా తీసుకుని తెరకెక్కించబడిన గొప్ప చిత్రమని అన్నారు. ముఖ్యంగా సిద్ధార్థ్, శరత్ కుమార్ నటన ఆకట్టుకునేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా మొత్తం ఓ హృద్యమైన అనుభూతిని కలిగిస్తుందని ఆయన చెప్తున్నారు.
ఇప్పటికే తమిళంలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, తెలుగులో కూడా బాగా ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగులో ఈ సినిమా ఎంతవరకూ కలెక్షన్లు రాబడుతుంది అన్నది చూడాలి కానీ, ఇప్పటివరకూ నెలకొన్న హైప్ బట్టే చూస్తే మంచి స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
