తాజాగా థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోలీవుడ్ చిత్రం “మదరాసి” గురించి ఇప్పుడు మంచి చర్చ నడుస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల నుండి అంతగా బలమైన టాక్ తెచ్చుకోలేకపోయినా, రిలీజ్ రోజుల్లోనే సరైన బుకింగ్స్ తో ముందుకు వెళ్తోంది.
ఈ సినిమాపై లెజెండరీ దర్శకుడు శంకర్ తన అభిప్రాయం పంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాటల్లో, మదరాసి ఒక సరదాగా ఎంజాయ్ చేసే కమర్షియల్ మూవీ అని చెబుతున్నారు. మురుగదాస్ అన్ని అంశాలను చక్కగా మిక్స్ చేసి, థియేటర్‌లో చూడదగ్గ విధంగా తెరకెక్కించారని ఆయన అభిప్రాయం.
శివకార్తికేయన్ పోషించిన పాత్ర ఈసారి కొంచెం కొత్తగా, భిన్నంగా ఉందని, ఆ రోల్‌కి పూర్తి న్యాయం చేశాడని శంకర్ అన్నారు. అలాగే అనిరుద్ అందించిన సంగీతం సినిమా లోకీ మరింత ఎనర్జీ తీసుకొచ్చిందని, విలన్‌గా కనిపించిన విద్యుత్ జమ్వాల్ స్క్రీన్ మీద అదిరిపోయాడని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
