జక్కన్న సినిమాల గురించి కరణ్ జోహార్ ఏమన్నాడంటే! బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ గొప్ప గొప్ప మూవీస్ కి లాజిక్‌తో అవసరం లేదంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ కి తన కథపై నమ్మకం ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి, సందీప్ వంగా, అనిల్ శర్మల చిత్రాల గురించి కరణ్ మాట్లాడారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ‘కొన్ని సినిమాలు లాజిక్ కంటే నమ్మకం ఆధారంగానే విజయాన్ని సాధిస్తాయి. గొప్ప దర్శకుల సినిమాల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాపై నమ్మకం ఉంటే ప్రేక్షకులకు లాజిక్ అవసరం లేదు. ఉదాహరణకు రాజమౌళి సినిమాలను పరిశీలిస్తే.. ఆయన చిత్రాల్లో లాజిక్‌ల గురించి ప్రేక్షకులు ఎప్పూడూ ఆలోచించరు. ఆయనకు తన కథపై పూర్తి నమ్మకం ఉంటుంది. ఎలాంటి సన్నివేశాన్నైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కిస్తారు’ అంటూ కరణ్ జోహార్ చెప్పారు. గతేడాది ఐదు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కరణ్ ప్రస్తుతం ‘ధడక్ 2’తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.