ఏంటిది ..అసలు క్లారిటీ లేకుండా!

Friday, December 5, 2025

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ సినిమా అఖండ 2 తాండవం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందీ. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వస్తున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. బోయపాటి – బాలయ్య కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్‌లో ఓ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది కాబట్టి ఈ సినిమాపై అందరిలోనూ భారీ ఆసక్తి నెలకొంది.

ఇప్పుడు ఈ సినిమా పనులు పూర్తిగా స్పీడ్ మీద సాగుతున్నాయి. మొదట మేకర్స్ దసరా సమయంలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారాన్ని బట్టి ఆ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి. కానీ దీనిపై మేకర్స్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజన్‌లో పడుతున్నారు.

ఇక ఈ నెలలోనే బాలకృష్ణ పుట్టినరోజు ఉండటంతో ఆ స్పెషల్ డే కోసం భారీ టీజర్‌ను రెడీ చేస్తున్నట్లు టాక్. ఆ టీజర్‌కి భారీ స్థాయిలో మాస్ ఎలిమెంట్స్‌తో కట్ చేస్తున్నారని సమాచారం. అలాగే అదే టీజర్‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.

ఇప్పుడు అసలు ఈ సినిమాను దసరాకే తీసుకురావాలనుకుంటున్నారా లేక వేరే కొత్త తేదీని ఫిక్స్ చేయాలనుకుంటున్నారా అనే వివరాలు ఆ టీజర్‌లోనే బయటపడనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా అఖండ 2 పై ఎలాంటి క్లారిటీ కావాలన్నా అది బాలయ్య బర్త్ డే స్పెషల్ టీజర్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles