ఏంటి..ఇది నిజమా…మోక్షు స్పెషల్‌ రోలా?

Monday, December 23, 2024

నందమూరి నటిసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షఙ ఎంట్రీ గురించి బాలయ్య అభిమానులు, నందమూరి అభిమానులు ఎంతగానో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం బాలకృష్ణ కూడా.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సంవత్సరం ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. మరోపక్క ‘అఖండ 2’ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.

మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ, ‘అఖండ 2’ షూటింగ్ కి లింక్ ఉంటుందని టాక్. ‘అఖండ 2’ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. డైనమిక్‌ దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి మోక్షజ్ఞ కోసం ఓ స్పెషల్ రోల్ రాసుకున్నాడని.. సెకండ్ హాఫ్ లో మోక్షజ్ఞ పాత్ర వస్తోందని ఇప్పటి సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. దీని గురించి మోక్షజ్ఞ పై టెస్ట్ షూట్ కూడా చేశారని రుమార్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉన్నా.. నందమూరి అభిమానులకు పండగే.

ఇక కథ ప్రకారం.. సినిమా పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే యాంగిల్‌ లో  సినిమాలోని సీన్లు ఉంటాయని తెలుస్తుంది. అలాగే..హిందూ దేవాలయాలకు సంబందించిన లింక్స్ తో పాటు దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేసి చూపించనున్నారని టాక్‌. ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు సమాచారం. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles