పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా “ఓజి” చుట్టూ అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. విడుదలకు దగ్గర పడుతున్న తరుణంలో సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తయినట్టు సమాచారం వస్తోంది. ఇప్పుడు ఈ మూవీ రన్ టైమ్ గురించి కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది.
తాజా టాక్ ప్రకారం ఓజి సినిమా దాదాపు 156 నిమిషాల నిడివితో థియేటర్లలో కనిపించబోతోందని చెబుతున్నారు. అంటే సుమారు రెండు గంటల 36 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ మ్యాజిక్ స్క్రీన్ మీద కొనసాగనుందని అర్థం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
