కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొంత కాలం క్రితం వచ్చిన సినిమాలన్ని కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే ఊపు లో కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. టాలీవుడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తియినట్లు సమాచారం.
తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చేసింది..ఈ సినిమాలో నాగార్జున నటిస్తున్నాడు.. ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. ఈ సినిమా కోసం అటు నాగార్జున ఫ్యాన్స్, ఇటు ధనుష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా వెయిట్ చేస్తున్నారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో కూడా శేఖర్ కమ్ముల ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాడు.. టైటిల్ కు తగ్గట్లే సినిమా కథ ఉండబోతుందని ఓ క్లారిటీ అయితే వచ్చేసింది…
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ అప్డేట్ ను విడుదల చేశారు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఆ పోస్టర్ లో మే 2న టీజర్ రాబోతుందని చిత్ర బృందం ప్రకటించారు.. ఆ పోస్టర్ లో డబ్బుల కట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. కింగ్ పోలీస్ గా కనిపిస్తే, మరి ధనుష్ రిచ్ మ్యాన్ గా కనిపిస్తారేమో అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా ఈ సస్పెన్స్ తీరాలంటే మాత్రం మరోక్కరోజు వెయిట్ చెయ్యాల్సిందే.. సినిమా కథ గురించి టీజర్ లో చూడవచ్చు