పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ మూవీ వార్ 2 వచ్చే ఏడాది ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్‌పై మాస్ ఫెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా చుట్టూ భారీ బజ్ ఏర్పడింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, వీళ్లిద్దరిపై ఒక పవర్‌ఫుల్ టీజర్‌ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయని వినిపిస్తోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
ఎన్టీఆర్, హృతిక్ కలయికవల్ల సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగిపోయింది. వీరిద్దరిని ఒకే సినిమాలో చూడబోతున్నారనే విషయమే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర ఎలా ఉంటుందనే కూర్చుని ఎదురు చూస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తయ్యిందని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.
