మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా వస్తున్న భారీ ఫాంటసీ సినిమా విశ్వంభర గురించి ఇప్పుడు అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగిపోతోంది. త్రిగుణ దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తోన్న ఈ మూవీపై మొదటి నుంచి మంచి హైప్ ఉన్నా, ఇంకా రిలీజ్ డేట్ ఖరారు చేయకపోవడం తో అభిమానుల్లో నిరాస చుట్టేస్తోంది.
అసలు మొదట్లో ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలన్న ప్లాన్ తో మేకర్స్ ముందుకెళ్లారు. కానీ ఆ డేట్ మిస్ అయ్యింది. ఇప్పటివరకు కూడా కొత్త విడుదల తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం షూటింగ్ తుది దశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. చిరంజీవి ఇప్పటికే తన తదుపరి ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టేశారు. ఇక విశ్వంభర సినిమా విషయంలో ప్రస్తుతం ఓ ప్రత్యేక పాట చిత్రీకరణ జరుగుతోందట. ఆ ఐటెం నెంబర్ పూర్తయిన వెంటనే మొత్తం షూటింగ్ పూర్తవుతుందని టాక్ వినిపిస్తోంది.
దాంతో చిరు ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు రిలీజ్ డేట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాంటసీ జానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇంకా ఏ అప్డేట్ వచ్చినా వైరల్ అవుతుండటం విశేషం. మేకర్స్ దగ్గర నుంచి ఓ క్లారిటీ రాగానే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
