జపాన్లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫైనల్ వసూళ్లు ఎంతంటే!

Monday, December 8, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన ప్రైడ్ ఇండియన్ మూవీ “రౌద్రం రణం రుధిరం” గురించిఅందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం వసూళ్ళని మించి ఎంతో గుర్తింపు తెలుగు సినిమాగా భారతీయ సినిమాకి తీసుకొచ్చింది.

అయితే ఈ సినిమా మన దగ్గర కంటే అతి పెద్ద హిట్ గా జపాన్ లో నిలిచింది. మన దగ్గర సుమారు 100 రోజులు అది కూడా కొన్ని సెంటర్స్ లోనే ఆడింది కానీ జపాన్ లో మాత్రం ఏకంగా 365 రోజులకి పైగా ఈ చిత్రం ఈజీగా రన్ అయ్యింది. మధ్యలో కొన్ని కొన్ని రోజులు అయితే రిలీజ్ రోజు కంటే వసూళ్లు ఎక్కువ రాబట్టాయి.

ఇలా పలు హాలీవుడ్ సినిమాలని సైతం క్రాస్ చేసి RRR రికార్డు వసూళ్లు అందుకుంది. అయితే అసలు RRR ఓవరాల్ గా ఎంత రాబట్టిందో ఇపుడు తెలుస్తుంది. ఈ చిత్రం అక్కడ 2.5 బిలియన్ జపాన్ యిన్స్ ని వసూలు చేసింది.అంటే మన కరెన్సీలో చూసుకున్నట్టయితే సుమారు 150 కోట్ల గ్రాస్ ని జపాన్ లో RRR అందుకొని సెన్సేషన్ రికార్డులు క్రియేట్‌ చేసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles