పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారీ సినిమా “కన్నప్ప” ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. మంచు విష్ణు లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా, స్టార్స్ తో నిండిపోయిన గ్రాండ్ ప్రాజెక్ట్‌గా ముందే మంచి హైప్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా మోహన్ బాబు నిర్మాణంలో, ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ హిస్టారికల్ డ్రామా విడుదలకు ముందు నుంచే భారీ చర్చలకు దారితీసింది.
ఇప్పటికే ప్రీమియర్లు, బుకింగ్స్ విషయంలో ఈ చిత్రం మంచి జోష్ చూపుతోంది. ఇప్పటివరకు విష్ణు కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాకి బంపర్ బుకింగ్స్ జరగడం గమనార్హం. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మొదటి రోజే ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న క్రేజ్ చూస్తే వసూళ్లు మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా పాన్ ఇండియా స్థాయిలో పేరున్న స్టార్స్ కనిపించనున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ క్యాస్టింగ్ సినిమాకి మరింత వెయిట్ పెంచింది. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ సినిమాతో విష్ణు కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ రానుందన్న విశ్వాసం ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ తో పాటు సినిమా టాక్ ఎలా ఉంటుందన్న ఆసక్తి ఇండస్ట్రీలో అలాగే కొనసాగుతోంది.
