పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజి” సినిమాపై మళ్లీ కొత్తగా ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఇది ఎంతో భారీ అంచనాలు క్రియేట్ చేసుకుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేసేందుకు పవన్ డేట్స్ ఇచ్చాడట. అయితే ఈ టాక్‌తో పాటు మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వైరల్ అవుతుంది. అదేంటంటే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక యాక్షన్ సీన్‌కి షర్ట్ లేకుండా కనిపించబోతున్నాడట.
ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, పవన్ కెరీర్ తొలినాళ్లలో కొన్ని చిత్రాల్లో మాత్రమే అలా కనిపించాడు. ఆ తర్వాత మాత్రం అలాంటి సీన్స్ అన్నింటినీ దూరం పెట్టేశాడు. ఇప్పుడు మళ్లీ ఇలా ఒక సీన్లో పవన్ విభిన్నంగా కనిపిస్తాడన్న వార్త అభిమానుల్లో కొత్త ఆసక్తి పెంచుతోంది.
వాస్తవంగా ఇలాంటి సీన్ ఉంటుందా లేదా అన్నది అధికారికంగా క్లారిటీ రాలేదు కానీ, అభిమానులు మాత్రం ఈ ఊహను ఆసక్తిగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా పైనే అంత ఫోకస్ ఉండడంతో, ఏ చిన్న అప్డేట్ అయినా వైరల్ అవుతోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో అనేది అతి త్వరలోనే తెలుస్తుంది.
ఇక ఓజి మీద భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, ఇలాంటి ప్రత్యేకమైన సీన్లు ఉంటే సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
