దాని గురించి రణ్‌బీర్‌ ఏమన్నాడంటే!

Andhrawatch
1 Min Read

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌ లో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘యానిమల్’ సినిమా భారీ కలెక్షన్స్ ను అందుకుని  అద్భుత విజయాన్ని సాధించింది. అయితే, ఈ సినిమా పై ఎన్నో విమర్శలు వచ్చాయనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ విమర్శలపై హీరో రణ్‌బీర్‌ కపూర్‌ స్పందించారు. ‘ఇఫ్ఫీ’ వేదికగా ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ..‘యానిమల్‌ విషయంలో అందరి అభిప్రాయాలతో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు.

అయితే, ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీసుకురావాల్సిన బాధ్యత మా అందరి పై ఉంది. కొత్తదనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక నటుడిగా ఇది చాలా ముఖ్యం. ఎప్పుడైతే నటులందరూ విభిన్నమైన పాత్రలు పోషిస్తారో.. అప్పుడే వారి కెరీర్‌ బాగుంటుంది’ అంటూ రణబీర్ తెలిపారు.

అన్నట్టు ఇదే వేదికపై రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ.. బాలీవుడ్‌ దిగ్గజాలను నేటి యువతరానికి తెలిసేలా చేసే బాధ్యత మనది. అందులో భాగంగానే డిసెంబర్‌ 13 నుంచి 15 వరకు ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను చేస్తున్నాం. ఈ క్రమంలోనే భారతదేశమంతా రాజ్‌ కపూర్‌ సినిమాలను ప్రదర్శించనున్నాం’ అని రణ్‌బీర్‌ ప్రకటించారు. రాజ్‌ కపూర్‌ నటించిన కొన్ని అపురూమైన చిత్రాలను ఈ జనరేషన్ కి అందించాలని రణ్‌బీర్‌ కపూర్‌ చూస్తున్నారు.

Share This Article