సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో అడవి రాముడు స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. 1977లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటు రాఘవేంద్రరావు కెరీర్ కి చాలా ప్లస్ అయింది. అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు ఈ సినిమా గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ సినిమాలో మొదట హీరోగా శోభన్ బాబును అనుకున్నారు అని, కానీ ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారు నటించారని, సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి.
ఈ రూమర్స్ పై రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘మొదట కూడా ఎన్టీఆర్ నే అనుకున్నాం. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం. కాకపోతే, నేను లైన్ గా అనుకున్న సమయంలో శోభన్ బాబు కూడా బాగుంటారు అని ఒక ఆప్షన్ గా అనుకున్నాం. ఐతే, ప్రొడ్యూసర్ వచ్చి రామారావు గారితో సినిమా చేస్తున్నాం. దర్శకుడిగా మీ పేరు చెప్తే ఆయన వెంటనే ఓకే అన్నారు అని చెప్పారు. వెంటనే నా దగ్గర ఉన్న అడవి రాముడు లైన్ ను డెవలప్ చేశాం’ అంటూ రాఘవేంద్రరావు తెలిపారు.
