“మిరాయ్” సినిమా విజయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఫెస్టివల్ మూడ్ లో ఉంది. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా, మంచు మనోజ్ విలన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ విజయోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో తేజ సజ్జ, మంచు మనోజ్ ఇద్దరూ తమ అనుభవాలను పంచుకున్నారు.
తేజ మాట్లాడుతూ, ప్రభాస్ ఎప్పుడూ కొత్త తరం ఆర్టిస్టులకు ప్రోత్సాహం అందించడంలో ముందుంటారని చెప్పాడు. మిరాయ్ కోసం వాయిస్ ఓవర్ చెప్పమని కోరినప్పుడు ఆయన వెంటనే అంగీకరించారని, దాంతో సినిమాకి మరింత బలం చేరిందని తేజ ఆనందం వ్యక్తం చేశాడు.
తదుపరి మంచు మనోజ్ కూడా స్పందిస్తూ, ప్రభాస్ వాయిస్ ఓవర్ తో థియేటర్లలో అదిరిపోయే ఎనర్జీ కనిపించిందని పేర్కొన్నాడు. తమ అన్నదమ్ములిద్దరికీ డార్లింగ్ స్టార్ తోడుగా నిలిచాడని చెప్పి, ప్రభాస్ ఇచ్చిన సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
