టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో వరుసగా 8 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఒకరు. అయితే తను తెరకెక్కించిన తాజా మూవీ “సంక్రాంతికి వస్తున్నాం” రికార్డులు తిరగరాస్తుండగా టీం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో అనీల్ రావిపూడి కాంబోలో సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ ప్రాజెక్ట్ పై తన తాజా కామెంట్లు వైరల్ గా మారాయి. వెంకటేష్ గారి సినిమాలో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే.
అలాంటిది చిరంజీవి గారికి ఈ తరహా మంచి మెలోడీ సాంగ్స్ పడితే ఎలా ఉంటుంది? ఇలాంటి మెలోడియస్ సాంగ్స్ కి ఆయన గ్రేస్ యాడ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కచ్చితం గా ఇంతే హార్డ్ వర్క్ అక్కడ కూడా పెడతా ప్రామిస్ అంటూ చెప్పుకొచ్చారు.
దీంతో మెగా ఫాన్స్ లో మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది.