టైమ్‌ రన్ ఎంతంటే!

Monday, April 7, 2025

టైమ్‌ రన్ ఎంతంటే! తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను తొలుత సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని వేసవి సీజన్‌కు షిఫ్ట్ చేశారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ ట్రీట్‌ను చిత్ర యూనిట్ రెడీ చేసింది. గుడ్ బ్యాగ్ అగ్లీ చిత్ర టీజర్‌ను రేపు(ఫిబ్రవరి 28) రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ టీజర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే, ఈ టీజర్ నిడివి 1 నిమిషం 34 సెకన్లు ఉండనుందని.. ప్రేక్షకులను అలరించే విధంగా ఈ టీజర్ కట్ ఉండనుందని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాలో అజిత్ వైవిధ్యమైన లుక్స్‌తో కనిపిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles