వాట్ ఏ న్యూస్ మరోసారి జత కట్టబోతున్న సూపర్‌ హిట్‌ కాంబో!

Tuesday, January 21, 2025

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చిత్రీకరణలో  బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అయితే పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ మరో రెండు సినిమాలు చేస్తున్నట్లు నెట్టింట పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

కానీ వాటిపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.ఈ క్రమంలో.. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో.. మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. ఆయన నెక్ట్స్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతుంది. హారికా క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కనుంది. ఇప్పటికే అల్లు అర్జున్-త్రివిక్రమ్- హారికా క్రియేషన్స్ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఇందులో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles