ఏంటి బాస్ ఈ లుక్‌!

Friday, April 4, 2025

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభాస్‌ను కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వానపత్రికను అందించారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ లాంగ్ హెయిర్‌లో డార్లింగ్ లుక్ అదిరిపోయిందని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. నిజంగానే ఈ లుక్ లో ప్రభాస్ చాలా బాగున్నాడు. ముఖ్యంగా చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్, మరో డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‌ లో కూడా ఓ మూవీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles