వామ్మో..ఏంటి రౌడీ హీరోనా…ఇలా ఉన్నాడేంటి?

Wednesday, January 22, 2025

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలలో ఒకరైనా విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఖుషి, ఫ్యామిలీ స్టార్‌ వంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచినప్పటికీ విజయ్‌ మాత్రం వాటిని పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.
విజయ్‌ ప్రస్తుతం గౌతం తిన్ననూరి దర్శకత్వంలో VD12 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.

 ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిపి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఇప్పటికే కొంత భాగాన్ని షూటింగ్ చేయగా మరి కొంత భాగాన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఈ సినిమాకు సంబంధించి కొద్ది రోజుల క్రితం శ్రీలంక షెడ్యూల్ ను కూడా చిత్ర బృందం పూర్తి చేసింది. ఇప్పటికీ ఈ సినిమా దాదాపు 60 శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఓ సాలిడ్ అప్డేట్ ను పోస్టర్ రూపంలో అభిమానుల ముందుకు తీసుకుని వచ్చింది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ వర్షంలో తడుస్తూ ముఖంపై రక్తం కారుతున్నట్లుగా ఉన్నాడు. కారుతున్న నెత్తురుతో చాలా కోపంగా ఆకాశంలో చూస్తూ అరుస్తున్నట్లుగా ఉండే పోస్టర్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, అలాగే ఫస్ట్ లుక్కును ఈ నెలలో ప్రకటించనున్నట్లు  తెలుస్తుంది. అన్ని సరిగా కుదిరితే.. ఈ సినిమా మార్చి 28, 2025న విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles