వామ్మో..అనుష్క ఏంటిది!

Wednesday, January 22, 2025

 టాలీవుడ్ లో  టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్స్ లో  ముద్దుగుమ్మ స్వీటీ అనుష్క కూడా ఒకరు. మరి అనుష్క కొంచెం గ్యాప్ తీసుకుంటున్నప్పటికీ సాలిడ్ సబ్జెక్టు లతోనే అభిమానుల ముందుకు వస్తుంది. మరి అలా లేటెస్ట్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న మోస్ట్‌ అవైటెడ్ సినిమా “ఘాటీ” కూడా ఒకటి.

మరి షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇపుడు అవైటెడ్ ఫస్ట్ లుక్ ని తన బర్త్ డే కానుకగా విడుదల చేసేసారు. అయితే ఈ ఫస్ట్ లుక్ మాత్రం అనుష్కపై ఈ రేంజ్ లో ఉంటుంది అని ఎవరూ ఊహించలేదు. ఒక థ్రిల్లింగ్ లుక్ లో అయితే అనుష్క ఇందులో కనిపిస్తుంది.

చేతిలో హుక్కా పట్టుకొని ఇంటెన్స్ ఎమోషన్స్ తో ఆమె కళ్ళని చూపించారు. మొత్తానికి అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే మేకర్స్ హిట్ అందుకున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా ఈ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి ఫస్ట్ గ్లింప్స్ ని తీసుకుని రాబోతున్నారు. మరి అదెలా ఉంటుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles