టాలీవుడ్‌తో పాటు తమిళ సినిమా అభిమానుల్లోను ఆసక్తి రేపుతోన్న భారీ చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై మొదటినుంచే మంచి హైప్ ఉండగా, తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలకు తగ్గట్టే వచ్చింది.
ట్రైలర్ చూస్తే ఇది ఎమోషన్స్, డ్రామా, సస్పెన్స్ అన్నీ కలిసిన పక్కా కమర్షియల్ కథ అని స్పష్టంగా అర్థమవుతుంది. శేఖర్ కమ్ముల ప్రత్యేకత అయిన సహజ టేకింగ్ ఈ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన మార్క్ కనిపించడం విశేషం. ముఖ్యంగా ధనుష్ పాత్ర చాలా డీప్‌గా అనిపిస్తుంది. ఓ సాధారణ బిచ్చగాడిగా కనిపించిన అతడు ఏలా ప్రభావవంతమైన స్థితికి చేరాడు అనేదే కథలో కీలకం అయ్యేలా ఉంది. అదే సమయంలో నాగార్జున పాత్ర మాత్రం పూర్తి మిస్టరీలా కనిపిస్తోంది.
ఈ ఇద్దరి మధ్య ఏమైందో, ఎలాంటి పరిణామాలు జరిగాయో అనేది ట్రైలర్‌లో చూపించినంతలోనే ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపేలా ఉంది. రష్మిక పాత్ర కూడా ట్రైలర్‌లో హైలైట్ అయింది. కేవలం గ్లామర్ పాత్ర కాదు, కథలో కీలకంగా భాగమైనట్టు ఆమె క్యారెక్టర్ కనిపిస్తోంది.
ఇక ఈ కథలో ధనికులు, పేదలు మధ్య గల వ్యత్యాసాలను ఆసక్తికరంగా చూపించినట్టు తెలుస్తోంది. సామాజిక అంశాలను హార్ట్ టచింగ్‌గా మిళితం చేసినట్టు శేఖర్ కమ్ముల పనితనం కనిపిస్తోంది. ట్రైలర్‌కి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్‌కి బాగా నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇచ్చింది. నిర్మాణ విలువలు కూడా బాగా కనిపించడంతో సినిమా గ్రాండ్‌గా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది.
ఈ ట్రైలర్‌తో సినిమాపై ఎదురుచూపులు మరింత పెరిగాయి. అన్ని కోణాల్లో ఆసక్తిని రేకెత్తించిన కుబేర సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. అప్పటివరకు ఈ ట్రైలర్‌నే ఆడియెన్స్ మళ్లి మళ్లీ చూడడం ఖాయం.
